పెన్పహాడ్, ఆగస్టు 26 : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన మారం పవిత్రను మంగళవారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం నకిరేకంటి రవి, ఉపాధ్యాయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. తమ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న మారం పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు రావడం అభినందనీయమన్నారు. మారం పవిత్రతో తెలంగాణ రాష్ట్రంలోనే పెన్పహాడ్ జడ్పీహెచ్ఎస్కు గౌరవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనంద్ భాస్కర్, కృష్ణప్రసాద్, రాములు, ఉపేందర్, భిక్షం, కృష్ణయ్య, హనుమంతు, శ్రీధర్, విజయ కుమారి, పద్మ, పావని, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.