
నల్లగొండ ప్రతినిధి, (నమస్తే తెలంగాణ): పత్తి, ఇతర మెట్ట పంటల రైతులు వర్షం కోసం తదేకంగా ఆకాశం వైపు చూస్తున్న తరుణంలో రెం డు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా పత్తిచేలు వాడుపట్టి ఆకులు నేలకు వేస్తుండగా కురుస్తున్న వర్షాలు తాత్కా లికంగా రైతులను గట్టెక్కించినట్లే కనిపిస్తుంది. గురువారం నల్లగొండ జిల్లాలో సగటున 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చింతపల్లి మండలంలో అత్యధికంగా 6.4సెంటీమీటర్ల వర్షపాతం కురవగా మాడ్గులపల్లి, కొండమల్లేపల్లి, మునుగోడు, పీ.ఏ.పల్లి మండలాల్లో నాలుగు సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసింది.

ఒక్కో రోజు కొన్ని ఏరియాల చొప్పున రెండు రోజులుగా జిల్లా మొత్తం ప్రభావితం చేసే వర్షాలు కురుస్తుండడంతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మాసంలో గురువారం నాటికి సగటుకు కంటే వర్షం తక్కువ కురవగా రెండు రోజుల వర్షాలు దాన్ని కవర్ చేసేలా కనిపి స్తుంది. కాగా సూర్యాపేట జిల్లాలో ఒకటి, రెండు చోట్ల తప్పా పెద్దగా వర్షం కురవలేదు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం కొన్నిచోట్ల, గురువారం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. జిల్లా అంత టా ఈ వర్షం ప్రభావం ఉంది. గురువారం ఉదయం వరకు మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లలో వర్షం ఎక్కువగా నమోదు కాగా రాత్రి వరకు నల్లగొండ రెవెన్యూ డివిజన్లోనూ మంచి వర్షమే కురిసింది. మెట్ట పంటల ఎదుగుదలకు ఉపయోగపడేలా వర్షం ఉన్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలారంభం నుంచి పెద్దగా వర్షాలు కురవకపోవడం ముఖ్యంగా పత్తిపంటపై తీవ్ర ఆందోళన నెలకొన్నది.
నల్లరేగడి భూముల్లో కొంతమేరకు ఇబ్బంది లేకున్నా దుబ్బ, ఎర్ర నేలల్లో సాగు చేసిన పత్తి పంటకు వర్షం కురవడం అత్యవసరంగా మారిం ది. పక్షం రోజులుగా చుక్క వర్షం లేకపోవడంతో ఈ నేలల్లోని మెట్ట పంటలు దాదాపు వాడు పట్టే దశకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఊరటనిస్తున్నాయి. పత్తి చేలు ప్రస్తుతం కాత దశకు చేరుకున్నాయి. ఈ దశలోనే భూమిలో సరైన పదును అవసరం ఉండనుంది.

అడుగుమందులు పెట్టడం వల్ల మరింత ఏపుగా పెరిగి మంచి దిగుబడికి ఆస్కారం ఉంది. ప్రస్తుత వర్షాలతో పత్తి రైతులు కలుపుతీతతో పాటు అడుగు మందులు పెట్టనున్నారు. కంది, పెసర, ఇతర పప్పుధాన్యాల పంటలకు ఈ వర్షాలు జీవం పోయనున్నాయి. ఇక మెట్ట ప్రాంతాల్లో ముందస్తు నాట్లు పడిన వరి చేలకు కూడా వర్షాలు ఉపయోగమే.
అత్యధికంగా చింతపల్లిలో…
అత్యధికంగా చింతపల్లి మండలంలో 6.4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే దేవరకొండ డివిజన్లోనూ అన్ని మండలా ల్లో కలిపి 26.7సెం.మీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మాడ్గుపల్లిలో 5.6సెం.మీ., కొండమల్లేపల్లిలో 5.1సెం.మీ., మును గోడులో 4.6సె.మీ., పి.ఏ.పల్లి మండలంలో 4.5సెం.మీ. వర్షపాతం నమోదైంది.
గురువారం ఉదయానికి శాలిగౌరారం, నార్కట్పల్లి, చిట్యా ల, కట్టంగూర్, నేరడుగొమ్మ, నకిరేకల్ మండలాల్లో చినుకులు మాత్రమే పడ్డా యి. అయితే సాయంత్రానికి ఈ మండలాల్లోనూ మంచి వర్షమే కురిసింది. డివిజన్ల వారీగా చూస్తే మిర్యాలగూడలో 23.7సెం.మీటర్లు, నల్ల గొండలో 12.6సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నెలలో సగటు కంటే తక్కువే..
ఈ వానాకాలం సీజన్లో జూన్, జూలై నెలల్లో సాధారణానికి మంచి 50శాతం వరకు అదనపు వర్షపాతం నమోదు కాగా ప్రస్తుత ఆగస్టులో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఆగస్టులో గురువారం నాటికి 11.6శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26వ తేదీ వరకు ఆగస్టులో 108.9మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 96.2మి.మీటర్ల వర్షపాతమే నమోదైంది.

కాగా జూన్లో 85.2 మి.మీటర్ల వర్షపాతాని కి గానూ 133.7మి.మీ., జూలైలో 145.2మి.మీటర్లకు గాను 216.3మి.మీటర్ల వర్షపాతం కురిసింది. ఇక మండలాల వారీగా పరిశీలిస్తే జిలా ్లలోని మొత్తం 31 మండలాలకు గానూ 20 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురవగా 11 మండలాల్లో మాత్రం సాధారణా నికి అటూఇటూగా వర్షపాతం నమోదైంది.
సూర్యాపేటలో ఒకటి, రెండు చోట్లకే పరిమితం
సూర్యాపేట జిల్లాలో వర్షం ప్రభావం ఒకటి,రెండు ప్రాంతాలకే పరిమితమైంది. ఏడు మండలాల్లో చినుకులకే పరిమితమైంది. ఒక్క మేళ్ల చెర్వులో మాత్రం 27.3మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నేరడుచర్లలో 2.8మి.మీ, మట్టంపల్లిలో 1.8మి.మీ. వర్షపాతం నమోదైంది. హుజూర్నగర్, పాలకీడు, నాగారం, చివ్వెంల మండలాల్లో ఒక్క మిల్లీమీటర్ కంటే తక్కువే నమోదు కాగా మిగతా మండలాల్లో అస్సలు వర్షం కురవలేదని వాతావరణ శాఖ వెల్లడించింది.