నల్లగొండ రూరల్: వాన కాలం సీజన్లో వరి వేయవద్దని ప్రభుత్వం చెప్పనందున బాధ్యతతో పూర్తి స్థాయిలో వానకాలం సీజన్ ధాన్యం మొత్తం కోనుగోలు చేస్తామని ,యాసం గి సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేనం దున రైతులు వరికి బదులుగా ఆరు తడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు.
పీఏసీ ఎస్ అధ్వర్యంలో ఆర్జాలబావి సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో గత సీజన్లో నిల్వలు మిగిలిపోయినట్లు తెలిపారు.
కేంద్రం ఆవలంబిస్తున్న తీరుతో రైతులు నష్టపోకుండా ఉండేందు కు సీఎం కేసీఆర్ ఈ సీజన్లో ధాన్యం కోనుగోలు చేస్తు న్నారన్నారు. రైతులు 17శాతం తేమ ఉండేలా ధాన్యాన్ని అరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల న్నారు. అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో ఏడీఎ నూతన్ కూమార్, ఫౌరఫరాల శాఖ డీఎం నాగేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, వైస్ చైర్మన్ తవిట కృష్ణ , టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, గాదె రాంరెడ్డి, అబ్బగోని రమేశ్, మందడి వెంకట్‌రెడ్డి, రుద్రాక్షి వెంకన్న, హాషం, నారగోని నరసింహా, పంతంగి శ్రీనాథ్, ఏవో సుమన్ రామన్, వాసుదేవ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.