నల్లగొండ సిటీ ఆగస్టు 19: ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠాలు బోధించే టీచర్‌పై ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కక్ష పెంచుకొని డబ్బు కోసం పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. హత్య కు ముందు రూపారెడ్డి బాబూ..అన్న ఒక్క మా టే కేసులో కీలక ఆధారమైంది. హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరిగా బాబూ అని అన్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపా రు. ఈమేరకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం విలేకరుల సమావేశంలో హత్యకు సం బంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఈ కేసును సవాల్‌గా తీసుకొని దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశారు.
హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని ప్రత్యేక బృందాలను ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్వాడ్, సీసీ కెమెరా పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలు, పాత నేరస్తుల వివరాలు, అనుమానితుల కదలికలు, రౌడీషీటర్ల వెరిఫికేషన్ తదితర అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాల ద్వారా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70 సీసీ కెమెరాల పుటేజీలను విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్, ఇన్ఫర్మేషన్ టీమ్స్‌తో కలిపి మొత్తం 5 ప్రత్యేక బృందాలతో సుమారు 40 మంది పోలీ సు అధికారులు, సిబ్బంది 80మందికి పైగా అనుమానితులను విచారించారు. ప్రిన్సిపాల్ మృతికి సంతాపంగా వారం రోజులు స్కూల్‌కు సెలవులు ప్రకటించడంతో విద్యార్థుల విచారణ విషయంలో కొంత అలస్యం జరిగిందని పాఠశాల ప్రారంభమైన వెంటనే పోలీసులు, విద్యార్థులు సున్నితంగా విచారించడంతో పాటు రెండు రోజులుగా స్కూల్‌కు రాని కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు విద్యార్థుల కదలికలను పరిశీలించగా సీసీ పుటేజీలో లభించిన ఆధారాలు ఇద్దరూ విద్యార్థులపై అనుమానాలను బలపర్చాయి.
నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఉద యం 11.30 గంటల సమయంలో పెండ్లిపాకల ఎక్స్‌రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు పదోతరగతి విద్యార్థులను దొనియాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, వారి వద్ద రూ.154 లక్షల నగదు లభించింది. స్వాధీనం చేసుకున్న నగదులో మూడు 500 రూపాయల నోట్లకు రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించడంతో రూపారెడ్డిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగదును అపహరించినట్లు విద్యార్థులు తెలిపారని పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో హత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులూ ఒకే హాస్టల్ గదిలో ఉంటూ జల్సా లకు అలవాటు పడ్డారు. తల్లి దండ్రులకు తెలియకుండా సెల్ఫోన్లు వినియోగిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్‌ల్లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించేవారు. గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడిన సందర్భంగా ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమక్షంలో విద్యార్థులను మందలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రిన్సిపాల్‌పై కక్ష పెంచుకున్న వారు ఆమె వద్ద పెద్ద మెత్తంలో డబ్బు ఉం టుందనే ఉద్దేశంతో హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో సోషల్ మీడియాలో వెతికారు. అనంతరం హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు ముందు సదరు విద్యార్థులు వారం రోజుల పాటు రూపారెడ్డి కదలికలను గమనించినట్లు పోలీసులు తెలిపారు. పథకంలో భాగంగా కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారన్నారు. హత్య జరిగిన రోజు సాయంత్రం రూపారెడ్డి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుండీ, ప్యాంట్ తీసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారని అన్నారు. ఒకరు బయట కాపలా ఉండగా మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడయిందన్నారు. తెరిచి ఉన్న వంట గదిలో నుంచి ఇం ట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. అనంతరం బెడ్రూంలో ఉన్న సుమారు రూ.2.50లక్షల నగదు తీసుకొని ఇంటి వెనుక గోడ దూకి పారిపోయినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేసి కొంతదూరం వెళ్లిన తర్వాత దుస్తులు మార్చుకున్నారన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ ఎమ్వీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్, జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్సై రమేశ్, చింతపల్లి ఎస్సై రామ్మూర్తి, గుడిపల్లి ఎస్సై నరసింహులు, గుర్రంపొడు ఎస్సై వెంకన్న, సీసీఎస్ ఎస్సై సురేశ్, హెడ్ కానిస్టేబుళ్లు కరుణాకర్, విష్ణువర్ధనగిరి, వహీద్ పాషా, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, ప్రసాద్ రావు, ఫయాజ్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు హేమూ నాయక్, గులాం దస్తగిరి, సాయికుమార్, శివరాజ్, జునైద్ అహ్మద్, నరేశ్, సాయి, కమల్‌కిశోర్, వేణుగోపాల్ రెడ్డి, భాస ర్, శరణ్‌రెడ్డి, నాగరాజు, అనిల్, శేఖర్‌ను ఎస్పీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.