
నీలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి 30 శాతం పీట్మెంట్తో పీఆర్సీని అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిండ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ రాయకంటి ప్రతాప్ అన్నారు. బుధవారం వారు జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్లో మా ర్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం తరుపున సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం టీఎన్జీవోస్ కార్యాలయంలో కూడా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ ఉద్యోగులను సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పేస్కేలును అమలు చేయించామన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులకు కూడా 30శాతం పీట్మెంట్తో కూడిన పీఆర్సీని అమలు చేయించామని, ఇందుకు ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులకు ఎల్లవేళ్లలాఅండగా ఉంటున్న విషయాన్నిమర్చిపోవద్దని కోరారు.ఉద్యోగుల బదిలీ లు, జోనల్ విధానంతోనే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్నామని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని కోనియాడారు
సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు ఎం.శ్రావణ్‌కుమార్, కంచనపల్లి కిరణ్‌కుమార్, కోశాధికారి మేడి జయరావు, రాష్ట్ర నాయకులు చేపూరి నర్సింహాచారి, కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, శ్రీరాం, జిల్లా నాయకులు కే.దయాక ర్రావు, ఆకునూరి లక్ష్మయ్య, జే. శేఖర్‌రెడ్డి, నాగిళ్ల మురళి, పంతుల శ్రీనివాస్, ఖలీం, వెల్లంపల్లి రాజయ్య, జిల్లా రాజ మల్లయ్య, తాజుద్దీన్ తదితరుల పాల్గొన్నారు.