
రామగిరి: తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలను ప్రభుత్వ ఆదేశాలతో తీసుకువచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీ, ఫీజలలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చాం…సీఎం కేసీఆర్ విజన్‌తో ఏర్పాటు చేసిన గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాలతో పాటు ఇక్కడి విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలు స్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి వెల్లడించారు.
టీఎస్‌పీఈసెట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా నమస్తే తెలంగాణ పలుకరించగా ఉన్నత విద్యా వ్యవస్థ, యూని వర్సిటీలు, ఎంజీయూ అభివృద్ధి అంశాలపై ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ. వి.వెంకటరమణ, ఎంజీయూ వీసీ ప్రొ.సిహెచ్.గోపాల్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. దేశంలోనే విద్యా హబ్‌గా హైద్రాబాద్ కీలక భూమితో నిలుస్తుందన్నారు.
హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీతో పాటు దేశానికి తలమానికంగా ఉండే ఎన్నో యూనివర్సిటీలు, పరిశోధన కేంద్రా లున్నాయన్నారు. ఇవి ఉన్నత విద్యామండలితో కలిసి ముందుకు సాగుతాయన్నారు. ఇలా వ్యవస్థలన్నీ ఒకే చోట ఉన్న ది దేశంలోని హైదరాబాద్‌లో మాత్రమేనని గుర్తు చేశారు. మరో వైపు మంత్రి కేటీఆర్ విజన్‌తో తీసుకువచ్చి ఐటీ హబ్ ఎంతో ముఖ్యమైందన్నారు.
అదేవిధంగా విద్యలో దేశంలో జీఈఆర్‌లో తెలంగాణ 36శాతం ఉండటం గమనార్హమన్నారు. నూతన జాతీయ విద్యా విధా నం -2019కి అనుగుణంగా ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలతో పాటు కళాశాలల్లో నాణ్యమైన విద్య అందే లా కృషి చేస్తుందన్నారు. డిగ్రీలో బాకెట్ సిస్టం ప్రవేశ పెట్టి విద్యార్థులకు కోర్సుల ఎంపిక సౌలభ్యత కల్పించామన్నారు.
మరోవైపు ఎన్సీటీఈ ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల బీఈడీ కోర్సు అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే రా ష్ట్రంలో పలు కళాశాలలు ఈ కోర్సు నిర్వహణకై ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయని స్పష్టం చేశారు. అంతర్జాతీ య, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణలో ఉన్నత విద్యా వ్యాప్తి చేసి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అంది స్తామన్నారు.
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా మన ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్స్‌ను ఇస్తుందని, అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఉన్నత విద్య కోర్సులోకి వచ్చి బీసీ విద్యార్థులకు పూర్తి రియింబర్స్‌మెంట్ చెల్లిస్తుందన్నా రు. ఇది నిరుపేద విద్యార్థులకు గొప్ప వరమని అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నూతనంగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రారంభం(ఎంఈ డీ, బీపీఈడీ, ఎంపీఈడీ) ఏర్పాటుకు తమవంతుగా కృషి చేసి ఇటు ప్రభుత్వానికి అటు ఎన్‌సీటీఈకి అనుసంధానంగా వ్య హరించి అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. అయితే ప్రస్తుత వీసీ ప్రొ.గోపాల్‌రెడ్డి ఎంతో సమర్ధత, నిబద్ధత ఉన్న వ్యక్తి అని ఆయన సారధ్యంలో యూనివర్సిటీ అన్నిరంగాల్లో ముందుకు సాగుతుందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని నూతన యూనివర్సిటీల్లో ఎంజీయూ విద్యతో పాటు, అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి, ముందంజ లో ఉందన్నారు. అందుకే ఐదు సం.లుగా టీఎస్పీ ఈసెట్ నిర్వహణ అప్పగించామన్నారు. ఇదిలాఉంటే ఎంజీయూలో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ క్లాంప్లెక్స్ భవనాలు ఇంత పెద్దగా దేశంలో ఏ యూనివర్సిటీలో లేవన్నా రు. అందుబాటులోకి వస్తే విద్యార్థులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇక్కడి టీం వర్క్ చాలా బాగుందని వర్సిటీ బోధన సిబ్బంది, డిపార్టుమెంట్స్ పనితీరును అభినందించారు.