నల్లగొండ, జూలై 01 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నితీష రోహిత్, డాక్టర్ ప్రనూష రితేష్, డాక్టర్ మంజుల, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ విశ్వజ్యోతి లను సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డిస్టిక్ గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్, గెస్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ లయన్ డాక్టర్ గోపాల్ రెడ్డి, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ డాక్టర్ కడిమి హరినాథ్, క్లబ్ అధ్యక్షుడు లయన్ నిమ్మల పిచ్చయ్య, కార్యదర్శి లయన్ ఎర్రమాద అశోక్, కోశాధికారి లయన్ ఆనందపు ఆదినారాయణ, రీజన్ చైర్ పర్సన్ లయన్ మిరియాల యాదగిరి, యూత్ ఎంపవర్మెంట్ చైర్ పర్సన్ లయన్ శ్రీనివాస్, చాటర్ సభ్యుడు లయన్ కంభంపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.