రామగిరి, మే 18 : పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 6 ఖాళీలు (MPC, BPC ) అలాగే 8వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం కేవీఎస్ గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతాయన్నారు. అర్హులు ఈ నెల 25వ తేదీ వరకు ఆఫ్లైన్లో విద్యాలయ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు.