‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్.) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
– ఏ.ఐ.కే.ఎం.ఎస్. ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
రామగిరి, అక్టోబర్ 27 : నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్.) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ.ఐ.కే.ఎం.ఎస్. ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై సమగ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం అనేది కేవలం పంటల సాగుకు మాత్రమే పరిమితం కాదని, దానిపై రైతుల కుటుంబాలతో పాటు వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ వృత్తిదారులు ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్యలు, వ్యవసాయ పెట్టుబడుల పెరుగుదల వంటి అంశాలు రైతాంగాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ప్రకృతి అనుకూలించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల సమస్యలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
జిల్లాలో వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, భూగర్భజలాలు, సాగునీటి లభ్యత తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేసి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని, రైతులకు అవసరమైన రుణ సదుపాయాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించాలని, కూలి చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పశువులకు మేత, నీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పశు సంపదను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కే.ఎం.ఎస్. జిల్లా అధ్యక్షులు జ్వాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి, వేముల శంకర్, సహాయ కార్యదర్శి సిలువేరు జానయ్య, జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, బూరుగు సత్తయ్య, అంబటి నర్సయ్య, కల్లూరి అయోధ్య, ఏనుగు సత్తిరెడ్డి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర, పీవైఎల్ జిల్లా కార్యదర్శి బి వి చారీ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహా, పీడిఎస్యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, నాయకులు రావుల వీరేశం,దాసరి నర్సింహా, శ0బయ్య, హరి కృష్ణ, అంజయ్య, శ్రీను, బొమ్మపాల అశోక్, తీగల నర్సింహా పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

