చండూరు, అక్టోబర్ 10 : చండూరు మండల కేంద్రంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. సభకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ఆయా పార్టీల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో క్షేత్రస్థాయి నుంచి బీజేపీ ఓటమి ఆవశ్యకతను వివరించనున్నారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై, విజయవంతం చేయాలని నాయకులు కోరారు.