మర్రిగూడ, అక్టోబర్ 3 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు, 8వ వార్డు సభ్యుడు జర్పుల అర్జున్, సరంపేటకు చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఉపసర్పంచ్ మెండు నర్సింహయాదవ్, 3వ వార్డు సభ్యుడు జంగిలి జంగయ్య, నాయకులు జంగిలి చంద్రయ్య, మాడ్గుల భిక్షం, నక్క కిషన్, కల్లెం లింగయ్య, మోటం అబ్బాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మునుగోడును అథోగతి పాలు చేశాడని విమర్శించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసి రూ. 22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయిన అతడికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్తో జట్టు కడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీపీ గోవిందు యాదవ్, సర్పంచులు కుంభం నర్సమ్మామాధవరెడ్డి, వెనమల్ల వెంకటమ్మామధూకర్, పాక నగేశ్‌యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులుయాదవ్, ఉప సర్పంచ్ పాలకూర్ల జంగయ్య, నాయకులు వెనమల్ల నర్సింహ, ఈద కృష్ణ పాల్గొన్నారు.
100 మంది టీఆర్ఎస్లో చేరిక
మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు సోమవారం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. యాదగిరిగుట్టలోని గొంగిడి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, సర్పంచ్ మున్య, ఉపసర్పంచ్ బాల్సింగ్, కోఆప్షన్ సభ్యుడు ఆదిల్, గణేశ్, శ్రీకాంత్, నారాయణ్‌సింగ్ పాల్గొన్నారు.