చౌటుప్పల్, అక్టోబర్ 3 : హైదరాబాద్‌లోని చెత్త డంపింగ్‌యార్డును దండుమల్కాపురానికి తీసుకొచ్చి చౌటుప్పల్‌ను కంపు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి అని, ఉప ఎన్నికలో అతడిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 2014 ముందు ఏమాత్రం అభివృద్ధికి నోచని నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్న నాలుగేండ్లలో రూ.వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పరుగులు పెట్టించినట్లు ఆయన గుర్తు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మల్లికార్జునగర్‌కు చెందిన 150 మంది, 13 వార్డులోని రాంనగర్, కృష్ణానగర్, వినాయక్‌నగర్ కాలనీలకు చెందిన 250 మంది సోమవారం మాజీ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆత్మగౌరవాన్ని రూ.22వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన ఘనుడు రాజగోపాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసలు కాలనీల వైపు కన్నెత్తి చూడని వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయంలో కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించానని, చౌటుప్పల్ పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చి కట్టలను పటిష్టం చేయడం వల్ల భారీ వర్షాలకు సైతం లోతట్టు ప్రాంతాలు జలమయం కాలేదన్నారు.
సాగు నీటి కోసం రూ.150 కోట్లతో పిలాయిపల్లి కాల్వ పనులు చేయించినట్లు తెలిపారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మల్లికార్జుననగర్ కాలనీ వాసులు ఎం. వెంకటయ్య, పాండు, జంగయ్య, బాలు, శంకర్, శ్రీరాములు, రాములు, సత్యం, రాంనగర్ కాలనీకి చెందిన చెవ్వగోని మహేశ్‌గౌడ్, కళ్లెం నాగరాజుగౌడ్, ఎస్కే బడేసాబ్, సాయిగౌడ్, లింగస్వామిగౌడ్, శివగౌడ్, రాజు, సన్ని, గణేశ్, సాయి, మధు, ప్రవీణ్ ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు తొర్పునూరి నర్సింహగౌడ్, నారెడ్డి అభినందన్‌రెడ్డి, కౌన్సిలర్లు బొడిగె అరుణ, బాలకృష్ణగౌడ్, సుల్తాన్‌రాజు, తాడూరి శిరీషాపరమేశ్, నాయకులు గంట నరేంద్రసాగర్, కొయ్యడ శేఖర్‌గౌడ్, చెవ్వగోని వెంకటేశ్ పాల్గొన్నారు.
మల్కాపురం నుంచి 100 మంది
చౌటుప్పల్ : మండలంలోని మల్కాపురం, ఎస్. లింగోటం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 140 మంది సోమవారం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కూసుకుంట్ల గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మల్కాపురానికి చెందిన ఎం. బందెళి, దస్తగిరి, గౌన్బాయ్, లింగారెడ్డి, అఖిల్‌రెడ్డి, లింగస్వామి, వంశి, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, మాధవాచారి, ఎస్. లింగోటం గ్రామానికి చెందిన బొగ్గుల లింగస్వామి, తూర్పింటి ప్రదీప్, గణేశ్, నవీణ్, సాయిలు, నరేశ్, అనిల్, వేణు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడు చిన్నం బాలరాజు, ఎంపీటీసీ చిట్టంపల్లి శేఖర్, నాయకులు బొడెగి ఆనంద్‌గౌడ్, బాతరాజు యాదయ్య, తూర్పింటి యాదయ్య, మస్తాన్ యాదవ్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
మర్రిగూడ మండలం నుంచి..
మర్రిగూడ : మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైలారపు వెంకటేశ్‌యాదవ్, వల్లపు మైదులు, పాండు, మావిళ్ల వెంకటేశ్, కందుకూరి శ్రీశైలం, మహేశ్, శంకర్, తుమ్మలపల్లి నర్సింహతో పాటు 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, అంతంపేట పరిధిలోని రంగంతండాకు చెందిన 20 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బాలం నర్సింహ, నాయకులు వల్లంల సంతోశ్‌యాదవ్, నాయకులు మెరుగు మురళి, దాదె వెంకటయ్య, పుప్పాల యాదయ్య, చింతకుంట్ల ముత్యంరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వార్డు సభ్యుడు
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని శేరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు వీరేషం, పొర్లగడ్డతండాకు చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలవారు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజు, సర్పంచులు జక్కర్తి పాపయ్య, దోనూరి జైపాల్‌రెడ్డి, సుర్వి యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు వీరమళ్ల వెంకటేశం, టీఆర్ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.