యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 17 : అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిదని ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండ లం రామాజీపేటకు చెందిన జాగిళ్లపురం వివాన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షలు చెక్కును ఆమె శనివారం వివాన్ తండ్రి నవీన్‌కు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపాక తిరుమలారమేశ్, టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ ఆరె స్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు రాంచందర్, నాయకులు పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన ఆనంద్‌రెడ్డికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్ఓసీ చెక్కును డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి శనివారం ఆనందరెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొంగు శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన బానపురం వీరమ్మకు రూ.50వేలు, లోట్ల రాజిరెడ్డికి రూ.58వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బీస భిక్షపతి శనివారం లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ పోలెపల్లి జ్యోతిలక్ష్మి, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, సెక్రటరీ జనరల్ ఎర్ర మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.