రానున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని, కార్పొరేట్ శక్తులకు దాసోహం అయి ఆ ప్రాంత ప్రజలను వెన్నుపోటు పొడిచిన రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి భవనం, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం చండూరులో టీఆర్ఎస్కేవీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనీసం ప్రభుత్వం నుంచి ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడానికి సమయం లేని రాజగోపాల్‌రెడ్డి మునుగోడుకు అవసరం లేదన్నారు. రైతులను వ్యవసాయానికి దూరం చేసే బీజేపీలోకి చేరి ఏమి అభివృద్ధి చేస్తాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు విశ్వసనీయత పెరుగుతున్నదని, ఉప
ఎన్నికలో గెలిచేది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. ప్రజలను పక్కదారి పట్టించడం కోసం కుట్ర పూరితంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని సూచించారు.
చండూరు, సెప్టెంబర్ 11 : రాష్ర్టాన్ని అంధకారంలో నెట్టే కుట్రతోనే ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చండూరు మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కేవీ అత్మీయ సమ్మేళనంలో ఆయన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకు 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుంటే మోదీ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే గుజరాత్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మోటార్లకు మీటర్లు పెట్టి 6గంటల విద్యుతే అందిస్తున్నారన్నారు. ఎైట్లెనా తెలంగాణలో విద్యుత్ కోతలు పెట్టాలని కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదన్నారు. 2014 ముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం గుజరాత్లో నెలకొన్నాయన్నారు. సంపద మొత్తం ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి దేశాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నమే డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యమని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జానారెడ్డి, బండి సంజయ్, కోమటిరెడ్డితో సహా లబ్ధి పొందని వ్యక్తి ఎవరూ లేరన్నారు. పార్టీలకతీతంగా పథకాల అమలు దేశంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో నిర్విరామంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు మోదీకి నచ్చక వాటికి ఆటంకం కలిగించేందుకు మనకు రావాల్సిన పన్నులు విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నదన్నారు. కార్మికులందరూ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రాంబాబుయాదవ్, నారాయణ, జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షులు పగిళ్ల భిక్షం, బొమ్మరబోయిన వెంకన్న, వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు చిలువేరు ప్రభాకర్, మారయ్య, రేణుక, మత్యగిరి, దండు యాదయ్య, మాధవి, వరలక్ష్మి, ఆర్.ఆచారి, రవీందర్, ఆరుణ, రామచంద్రం, లింగయ్య, దశరథ పాల్గొన్నారు.
నాంపల్లి : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి గుణపాఠం తప్పదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, అదనపు తరగతి భవనం, పల్లె ప్రకృతి వనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం నుంచి ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి సమయం ఇవ్వని రాజగోపాల్‌రెడ్డి మునుగోడుకు అవసరం లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి గురించి ఏనాడూ సీఎం కేసీఆర్‌ను గానీ, తనను గానీ సంప్రదించలేదన్నారు. కాంట్రాక్టుల కోసం ఇతర రాష్టంలో తిరిగే వ్యక్తికి మునుగోడు ప్రజల సమస్యలు తెలువవన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ఎదురు నిలబడి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట నాయకుడు కర్నాటి విద్యాసాగర్, సర్పంచ్ మునుగల సుధాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, జిల్లా నాయకుడు పానగంటి వెంకన్న, అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కడారి శ్రీశైలంయాదవ్, నడింపల్లి యాదయ్య, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సపావత్ సర్దార్‌నాయక్ పాల్గొన్నారు.