చింతలపాలెం, సెప్టెంబర్ 8 : దళతుల అభ్యున్నతికే దళిత బంధు పథకమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిష్టాపురంలో దళితబందు పథకం కింద మంజూరైన పాడి గేదెలను లబ్ధిదారులు దేవపంగు దాసు, దాములూరి కిష్టయ్య, ఉప్పెల్లి అబ్బురాం, గొల్లపూడి బాల, దాములూరి జార్జికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
రాజకీయాలకతీతంగా నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా యూనిట్లు పొందినవారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, జిల్లా వెటర్నరీ వైద్యుడు శ్రీనివాస్‌రావు, ఎంపీపీ కొత్తమద్ది వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ రంగాచారి, ఎంపీడీఓ గ్యామానాయక్, తాసీల్దార్ సచిన్ చందర్ తివారీ, ఎంపీటీసీ సైదిరెడ్డి, నాయకులు మతీన్, బాల్‌రెడ్డి, పప్పుజాన్, నన్నె బుజ్జి, ఆలె సైదా, ఇస్మాయిల్, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి, నర్సింహారావు, నర్సింహారెడ్డి, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.