స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక మొక్కల నాటింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాలుపంచుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్రగొండ పార్కును విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.
భువనగిరి మండలం ఎర్రంబల్లి గ్రామంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మోహన్‌చంద్ర ఫర్గేస్ ఈత మొక్కలు నాటగా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు.