చందంపేట, జూలై 22 : పేదలకు డబుల్ బెడ్రూం అందించడం ద్వారా వారి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాలలో రూ.1.88 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉన్న పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతకు ముందు డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు పట్టాలు, చీరలను అందించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, ఎంపీపీ నూన్సావత్ పార్వతి, తాసీల్దార్ దేవదాసు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, ఉపాధ్యక్షుడు యాసాని రాజవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పీఆర్ డీఈ లింగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ నగేశ్, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈలు రాజు, శేఖర్, నాయకులు రమావత్ మోహన్‌కృష్ణ, గోసుల కవితాఅనంతగిరి, ఏర్పుల గోవిందుయాదవ్, కేతావత్ శంకర్‌నాయక్, బోయపల్లి రాములుగౌడ్, జక్కుల మున్నయ్య, వడ్త్య బాలు, బొల్లు రామకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, కుమార్, రవి, మహాలక్ష్మయ్య, లాల్‌సింగ్, సీఐ పరుశురామ్, ఎస్ఐ యాదయ్య పాల్గొన్నారు.
ఎస్బీఐ బ్రాంచి ప్రారంభం
దేవరకొండ : పట్టణంలోని డిండి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్రాంచిని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్బీఐ తెలంగాణ జీఎం దెబేసిశ్ మిత్ర, డీజీఎం ప్రశాంత్‌కుమార్, ఏజీఎం విజయకుమార్, కార్యదర్శి ఎన్వీటీ, రామకృష్ణ, మేనేజర్ బాజిత్, వెంకట్రామ్, రామాంజనేయులు పాల్గొన్నారు.
జానకమ్మ చిత్రపటానికి నివాళి
పీఏపల్లి : మండలంలోని భరత్పురం గ్రామానికి చెందిన బోయ జానకమ్మ మృతి చెందగా శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించారు. జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెలుగూరి వల్లపురెడ్డి, అంతిరెడ్డి ఉన్నారు.