చండూరు,జూలై 12 : కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన ఉయ్యాల అశ్విని విద్యుదాఘాతంతో మరణించడంతో సభ్యత్వ బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆమె భర్త సత్యనారాయణకు మంగళవారం ఆయన అందచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మారెడ్డి నర్సిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కోడి వెంకన్న, మండల అధికారి ప్రతినిధి బొడ్డు సతీశ్‌గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, బొబ్బల శ్రీనివాస్‌రెడ్డి, పాలకూరి రాములు పాల్గొన్నారు.
మర్రిగూడలో..
మర్రిగూడ : మండలంలోని నామాపురం,మర్రిగూడ గ్రామాల్లో కంచుకట్ల చిన్న బాలయ్య, గ్యార వంశీ ఇటీవల మృతి చెందగా వారికి పార్టీ ప్రమాద బీమా కింద మంజూరైన రూ.4 లక్షల విలువైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. అనంతరం ఇందుర్తి గ్రామంలో వార్డు సభ్యురాలు సోములమ్మ కుమారుడు చనిపోవడంతో పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. శివన్నగూడెంలో సీతారామచంద్ర స్వామి ఆల య పునర్మ్నిణానికి ఎండోమెంట్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధ్ది పనుల ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ, సహకార సంఘం చైర్మన్లు దంటు జగదీశ్వర్, బాలం నర్సింహ, పందుల యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, సీనియర్ నాయకుడు బచ్చు రామకృష్ణ, దళిత బంధు సమితి సభ్యుడు లపంగి నర్సింహ, ఐతగోని వెంకటయ్య, ఊరిపక్క నగేశ్, మారగోని వెంకటయ్య సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.