నల్లగొండ రూరల్ : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అందరితో సమానంగా దళితులు ఆర్థిక అవసరాలు సమకూర్చుకునేందుకు దళితబంధు ప్రవేశపెట్టారన్నారు. నల్లగొండ మండలం రాములబండకు చెందిన 23 మందిని, రంగారెడ్డినగర్‌కు చెందిన 16 మందిని, కనగల్ మండలం చెట్టచెన్నారానికి చెందిన 33మందిని, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడేనికి చెందిన 28 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీం పాషా, విజయలక్ష్మి, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, సర్పంచులు రూపాని జయమ్మాపెద్దులు, మామిళ్ల సైదులు, గంగమ్మాచంద్రయ్య, ఎంపీటీసీలు పాల్గొన్నారు.