మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బీజేపీకి రైతులే సమాధి కడతారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఎమ్మెల్యే రైతులతో కలిసి క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారనే కేంద్రం కావాలనే రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్, వైస్ చైర్మన్ విష్ణు, ఎంపీపీ సరళాహనుమంతరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చిట్టిబాబునాయక్, అన్నభీమోజు నాగార్జునచారి, లింగారెడ్డి, జే.రంగారెడ్డి, సైదులు, మదార్బాబా ఉన్నారు.
దామరచర్ల మండలంలో రైతులు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
మిర్యాలగూడ మండలంలోని గ్రామాల్లో ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. వేములపల్లి మండలంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. మొల్కపట్నం గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో నల్లజెండాలు ఎగుర వేసి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసన కార్యక్రమాల్లో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డీ నారాయణరెడ్డి, బాబయ్య, కరుణాకర్‌రెడ్డి, మోషీన్ అలీ, బాలాజీ, చిర్ర మల్లయ్య, గోవిందరెడ్డి, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సైదిరెడ్డి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సయ్య, సత్యనారాయణ, సైదులు, భిక్షం, సాంబశివరావు, లచ్చిరాం, శ్రీనునాయక్, శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లజెండాలతో రైతుల నిరసన ప్రదర్శనలు
దేవరకొండ : కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం మోదీ దిష్టిబొమ్మ దహనం, ఇండ్లపై నల్ల జెండాలతో నిరసన తెలిపారు. చింతపల్లి, పీఏపల్లి మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగొలు చేసేంతవరకు ఉద్యమిస్తామన్నారు. దేవరకొండలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. చింతపల్లి మండలంలో నల్లజెండాలతో నిరసన తెలిపి మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. డిండి మండలం ఎర్రగుంటపల్లిలో తెరాస యూత్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.
కొండమల్లేపల్లి మండలం కేశ్యాతండా వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో రైతులు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సర్వయ్య, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌నాయక్, బుజ్జినాయక్, మున్నయ్య, మల్లారెడ్డి, గిరిశంకర్రావు, జడ్పీటీసీ బాలూనాయక్, తిరుపతయ్య, రాములు, ఎంపీపీ సునితాజనార్దన్రావు, రైతు బంధు సమితి మం డల అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, వైస్ ఎంపీపీ పుల్లమ్మ, నాగార్జునరెడ్డి, కొండమల్లేపల్లి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దస్రూనాయక్, యుగేంధర్‌రెడ్డి, లింగారెడ్డి, సర్పంచులు సుధామణీవెంకట్రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,అనితారాములునాయక్, పీఏ పల్లి ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఏడుకొండల్‌యాదవ్, పరమేశ్, ముత్యంరావు, జడ్పీటీసీ ప్రవీణావెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : మండలంలోని కొమ్మేపల్లి, మర్రిచెట్టుతండా, తాటికోల్, కొండభీమనపల్లి గ్రామాల రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. కొమ్మేపల్లిలో వైస్ ఎంపీపీ సుభాశ్ ఆధ్వర్యంలో రైతులు వారి ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేశ్‌గౌడ్, సాజిద్, సర్పంచులు, విద్యావతీవెంకట్రెడ్డి, శ్రీనూనాయక్ పాల్గొన్నారు.
కేంద్రం దిగొచ్చేవరకు ఉద్యమం
హాలియా : కేంద్రం దిగొచ్చి ధాన్యాన్ని కోనుగోలు చేసేంత వరకు ఉద్యమిస్తామని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు, టీఆర్ఎస్ నాయకులు తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి కేంద్ర ప్రభత్వ వైఖరిపై నిరసన తెలిపారు. హాలియాలో తన నివాసంపై ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ నల్లజెండా ఎగురేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్యా యం జరిగితే రైతు నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ధాన్యం కోనుగోలు చేయకపోతే రాష్టంలో బీజేపీని రైతులు పాతరేయడం ఖాయమన్నారు.
బైక్ ర్యాలీ.. దిష్టిబొమ్మ దహనం
హాలియా మున్సిపాలిటీలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో బైక్‌లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, శంకరయ్య, సుధాకర్, మహేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ముత్యాలు, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, శీను, ప్రసాద్‌నాయక్, సైదులు, అన్వరుద్దీన్, డొమినిక్,సైదులు,లింగయ్య, సత్యం,వెంకటయ్య, నాగరాజు, రవి, శ్రీను, చెన్నయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) మండలంలో…
తిరుమలగిరి సాగర్ మండలంలోని రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలు ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, భిక్ష్యానాయక్, అంజిరెడ్డి, హరికృష్ణ, పెద్దిరాజు, చందులాల్ పాల్గొన్నారు.
పెద్దవూర మండలంలో…
మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు తమ ఇండ్లపై నల్లజెండా ఎగరేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి,లింగారెడ్డి, అబ్బాస్, హైమద్‌అలీ ఉన్నారు.
త్రిపురారం మండలంలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు నల్లజెండా ఎగరేసిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్, సర్పంచులు శ్రీనివాసరెడ్డి, సేవానాయక్, సుశీల్నాయక్, వెంకట్‌రెడ్డి, శ్రీను, నాగలక్ష్మి, మంగ్తనాయక్ పాల్గొన్నారు.
గుర్రంపోడు మండలంలో..
మండలంలోని రైతులు తమ ఇళ్లపై నల్లజెండ ఎగరేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవికుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ రామేశ్వరీధనుంజయ్, పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు చెన్నారెడ్డి, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
నిడమనూరు మండలంలో..
ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మండల వ్యాప్తంగా రైతులు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు లో తెలంగాణపై వివక్షను ఎండగడుతూ నినాదాలు చేశారు. ఊరూరా రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చేకూరి హనుమంతరావు, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ అంజయ్య, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ రామారావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంకతి వెంకటరమణ, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు పోలె డేవిడ్, యాదయ్య, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్‌రెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షుడు బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి లకుమాల మధుబాబు, ముప్పారం దేవస్థాన కమిటీ చైర్మన్లు వెంకటరమణ, లింగప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.