IND vs PAK : ఐసీసీ ఈవెంట్ ఏదైనా సరే.. భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. అభిమానులకు చెప్పలేనంత కిక్ ఇచ్చే దాయాదుల బిగ్ ఫైట్‌కు మరికాసేపట్లో షురూ కానుంది. కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు ఫ్యాన్స్ పోటెత్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడం.. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా ప్రేమదాస స్టేడియానికి తరలి వస్తున్నారు. ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడే ఇరుజట్ల పోరును కనులారా వీక్షించి మురిసిపోయేందుకు పెద్ద సంఖ్యలో మైదానానికి చేరకుంటున్నారు.
బాయ్‌కాట్ వార్తల నడమ దాయాదుల మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలకు తెరపడగా విమాన టికెట్లకు రెక్కలొచ్చాయి. కొలంబోలో హోటల్ బుకింగ్స్ కూడా భారీగా జరిగిపోయాయి. హై ఓల్టేజ్ మ్యాచ్‌లోని అసలైన మజాను ఆస్వాదించేందుకు అభిమానులు ప్రేమదాస స్టేడియానికి భారీగా తరలి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకే స్టేడియం గేట్లు తెరిచారు. స్టేడియం బయట ఫ్యాన్స్ తమ జట్టు జెండాను చెంపలపై వేయించుకొని హుషారుగా వస్తున్నారు.
#WATCH | Sri Lanka: Fans continue to arrive at R Premadasa Stadium in Colombo for the #T20WorldCup match between India and Pakistan; visuals from outside the stadium#INDvPAK #ICCT20WORLDCUP pic.twitter.com/DcNBFRSTzf
— ANI (@ANI) February 15, 2026
Visuals from outside the iconic R. Premadasa Stadium in Colombo, where India will take on Pakistan in the ICC T20 World Cup later today. Fans have started gathering in large numbers, creating an electric atmosphere ahead of the much-anticipated showdown.#IndiaVsPakistan… pic.twitter.com/jnAmhr3L35
— Gulistan News (@GulistanNewsTV) February 15, 2026
ప్రపంచంలోని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాసేపట్లో ప్రేమదాస స్టేడియంలో మొదలవ్వనుంది. సాయంత్రం 6:30కి టాస్ పడనుండగా.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసియా కప్‌తో కలిపి గత ఐదు మ్యాచుల్లో ఐదు పర్యాయాలు పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆరో విజయంతో దాయాదికి చెక్ పెట్టాలనుకుంటోంది. అయితే.. ఆ జట్టులోని ఉస్మాన్ తారీఖ్ భారత ఆటగాళ్లకు సవాల్ విసిరేలా ఉన్నాయి. సో.. సిలబస్‌లో లేని ప్రశ్నలా మారిన అతడిని ధీటుగా ఎదుర్కొటామని ఇండియన్ సారథి సూర్యకుమార్ యాదవ్ చెప్పేశాడు. నెట్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మకు అతడు తారీఖ్ స్టయిల్లో బౌలింగ్ చేసి.. ఎలా ఆడాలో సాధన చేయించాడు.