నల్లగొండ, ఏప్రిల్ 8 : ఈ నెల 11న మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. క్లాక్ టవర్ సెంటర్లో ఫూలే విగ్రహం వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు పూలు అలంకరణ, టెంటు, సౌండ్ సిస్టమ్, సమావేశ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫూలే జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్బంగా బీసీ సంఘం నేతలు కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చక్రహరి రామరాజు, కొండూరు సత్యనారాయణ, గుండు వెంకటేశం, వైద్యుల సత్యనారాయణ, పంకజ్ యాదవ్, కంది సూర్యనారాయణ, గండి చెరువు వెంకన్న, ఐతగోని జనార్దన్ పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనుల వేగం పెంచాలి
నీలగిరి : జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. నల్లగొండలో జరుగుతున్న అర్భన్ పార్కు, మర్రిగూడ జంక్షన్ పనులు, హైదరాబాద్ రోడ్డులోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్‌పాత్, ఎలక్ట్రికల్ పోల్స్ నిర్మాణం పనులను మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాస్, డీఈ నర్సింహారెడ్డి, వెంకన్న, ఏఈలు దిలీప్, వినోద్, ఏసీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు.