నేరేడుచర్ల, ఏప్రిల్ 6 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి లింగయ్య, సర్పంచ్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీను, ఎంపీటీసీ నాగవేణి, నాయకులు చలసాని శ్రీను, మేకపోతుల శ్రీను, కరుణాకర్‌రావు, సైదులు, రాజు, రమేశ్, గురువయ్య పాల్గొన్నారు.