కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 6 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయం నుంచి నకిరేకల్ బైపాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుటీల నీతితోని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తుందన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. బీజేపీ నాయకులకు తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. రాస్తారోకోలో పాల్గొన్న రైతులు, పార్టీ శ్రేణులు ప్లకార్డులతో కేంద్రం మొండి వైఖరి నశించాలని, ప్రధాని మోదీ ఢాం ఢాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో ఎమ్మెల్యేలు చిరుమర్తి, రవీంద్రకుమార్‌ను పోలీసులు పక్కకు తీసుకెళ్లి వదిలారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ రాంచందర్ నాయక్, ఎంపీపీలు కొలను సునీతావెంకటేశం, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కన్నెబోయిన జ్యోతి, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, సుంకరి ధనమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు నడికుడి ఉమారాణి, జడల ఆదిమల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్లు నూక సైదులు, పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, కట్టంగూర్ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ప్రగడపు నవీన్‌రావు, మందడి ఉదయ్‌రెడ్డి, మారం వెంకట్‌రెడ్డి, ఆవుల ఐలయ్య, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చింతల సోమన్న, కొప్పుల ప్రదీప్‌రెడ్డి, గాజుల బుచ్చమ్మ, చల్లా కృష్ణారెడ్డి, యల్లపురెడ్డి సైదిరెడ్డి, నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేశ్, పోగుల నర్సింహ, యానాల అశోక్‌రెడ్డి, దోసపాటి విష్ణుమూర్తి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, అంతటి శ్రీను, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కేతేపల్లి : నకిరేకల్‌లో నిర్వహించిన రాస్తారోకోకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వెళ్లిన వారిలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు బచ్చు జానకీరాములు, కట్టా శ్రవణ్‌కుమార్, కొండా సరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్,నాయకులు కె.ప్రదీప్‌రెడ్డి, తండు రాములుగౌడ్, ఆర్.సైదులుగౌడ్ ఉన్నారు.
కట్టంగూర్: నకిరేకల్‌లో నిర్వహించిన రాస్తారోకోకు మండల జడ్పీటీసీ తరాల బలరాములు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పలు వాహనాల్లో ర్యాలీగా తరలివెళ్లారు. వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు వడ్డె సైదిరెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, పరశురాములు, అంతటి శ్రీను, ఎడ్ల పురుషొత్తంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, నాయకులు పోగుల నర్సింహ, పులిగిల్ల వెంకన్న, ఏడబోయిన ఆంజనేయులు, చౌగోని నాగరాజు, పోతరాజు నగేశ్, గాజుల బుచ్చమ్మ, భిక్షం పాల్గొన్నారు.
మర్రిగూడ : చౌటుప్పల్‌లో జాతీయ రహదారి రాస్తారోకోలో మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, మార్కెట్ కమిటీ, సహకార సంఘాల చైర్మన్లు దంటు జగదీశ్వర్, బాలం నర్సింహ, పందుల యాదయ్య, నాయకులు బచ్చు రామకృష్ణ, లపంగి నర్సింహ, చెర్కు లింగంగౌడ్, కల్లు నవీన్‌రెడ్డి, కుంభం మాధవరెడ్డి, ఐతగోని వెంకన్న, ఊరిపక్క నగేశ్, మారగోని రామన్న, వల్లపు సైదులుయాదవ్ అయిలీ నర్సింహ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.