మునుగోడు, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ ఎస్‌లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్‌లో కాంగ్రెస్‌కు చెందిన చిలకరాజు యాదగిరి, రొమ్ముల విప్లవ్ గురువారం కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు తిరుగులేని శక్తిగా అవతరించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మందుల సత్యం, ఐతగోని శేఖర్, సర్పంచ్ వల్లూరి పద్మ, లింగయ్య, ఉప సర్పంచ్ ఎల్లంకి యాదగిరి, మార్కెట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, లింగయ్య, సింగమల అంజయ్య, బొడ్డుపల్లి వెంకన్న, ఆరెకంటి నరసింహ, దండు వెంకన్న, తిరగమల్ల కిశోర్, శంకర్, దండు వెంకటరమణ, హరిబాబు, మహేశ్, వెంకన్న, గణేశ్, వెంకన్న, పర్వతం, స్వామి, శ్రీశైలం పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు
మర్రిగూడ : ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, ప్రధానకార్యదర్శి ఐతగోని వెంకటేశ్‌గౌడ్, ఎంపీటీసీ ఊరిపక్క సరితానగేశ్, నాయకుడు బచ్చు రామకృష్ణ పాల్గొన్నారు.