బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు,
పార్టీ సంస్థాగత ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.