గుండాల, జూన్ 23 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వస్తాకొండూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సుంకరబోయిన మహేశ్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాగల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.