
మిర్యాలగూడ, మే25 : పట్టణంలో చేపడుతున్న రెండో విడుత జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ డీఈ, ఇన్చార్జి కమిషనర్ సాయిలక్ష్మి కోరారు. మంగళవారం రాంనగర్, బంగారుగడ్డ, శాంతినగర్, హౌసింగ్‌బోర్డ్ కాలనీల్లో జ్వర సర్వేను ఆమె పరిశీలించారు. సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని కోరారు. మెప్మా టీఎంసీ బక్కయ్య, సీఓలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చందంపేట : కరోనా లక్షణాలున్న వారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందాలని వైద్యాధికారి విజయ అన్నారు. మంగళవారం మండలంలోని చిత్రియాల, బుడ్డోని తండాలో గ్రామాల్లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆమె పరిశీలించారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఆమె వెంట ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.
కొవిడ్ కట్టడికి జ్వర సర్వే
మునుగోడు, మే 25 : కొవిడ్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ యాకూబ్ నాయక్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జ్వర సర్వేలో ఆయన పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలోని ప్రతి కుటుంబ ఆరోగ్య స్థితిగతులను సర్వే సిబ్బందికి స్వచ్ఛందంగా తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట ఏపీఓ శ్రీనయ్య, పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్, ఏఎన్ఎం ధనమ్మ, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
మర్రిగూడలో ఇంటింటి సర్వే
మర్రిగూడ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో రెండో విడుత జ్వర చేస్తున్నట్లు వైద్యాధికారి దీపక్ తెలిపారు. మండలకేంద్రంలో కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది పూర్తి వివరాలు అడిగి తెలుసు కుంటున్నారు. కరోనా వచ్చిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తగిన సలహాలు సూచనలు చేశారు. ఏఎన్ఎం అరుణ, ఆశ కార్యకర్తలు కౌసల్య, సునీత పాల్గొన్నారు.