
నీలగిరి/ నల్లగొండ రూరల్, జూలై 4 : పట్టణాలు, పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ లక్ష్యాలను చేరే దిశగా కృషి చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి 4, 21వ వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వామ్యం కావడం అభివృద్ధికి సంకేతమని అన్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలను ఆయన అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఫర్హాత్ ఫర్జానాఇబ్రహీమ్, పున్న గణేశ్, గోగుల శ్రీనివాస్, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, వట్టిపల్లి శ్రీనివాస్, ఈఈ శ్రీనివాస్, టీపీఓ నాగిరెడ్డి, డీఈ వెంకన్న పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట, రైతాంగ యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని యాదవ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులోని కొమురయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేకల యాదన్న, రామరాజు, సత్యనారాయణ, మోహన్‌బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నర్సరీని పరిశీలించిన డీపీఓ
కనగల్ : మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. తేలకంటిగూడెం గ్రామంలో వన నర్సరీని ఆయన పరిశీలించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో గ్రామాల్లో మొక్కలను విరివిగా నాటాలన్నారు. ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు నాటే విధంగా చూసుకోవాలన్నారు. ఎంపీఓ ముజావుద్దీన్, కార్యదర్శి యాదయ, సర్పంచ్ రాంబాబు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులను పరిశీలించిన అధికారులు
నల్లగొండ రూరల్ : నల్లగొండ మండలం ఖాజీరామారం, చందనపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన శ్రమదాన కార్యక్రమాల్లో నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొని పల్లె ప్రకృతి వనంతోపాటు నర్సరీలను పరిశీలించారు. వీధుల వెట చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, సర్పంచులు మున్వరున్నీసా బేగం, శ్రీనివాస్‌రెడ్డి, మణెమ్మ, గ్రామ ప్రత్యేక అధికారులు వాసుదేవరెడ్డి, సైదులు, కిరణ్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల, రామచంద్రాపురం, బొల్లెపల్లి, మల్లారం గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, పారిశుధ్య పనులను మండల ప్రత్యేకాధికారి బాలశౌరి పరిశీలించారు. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ బలరాములు, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ పర్వేజ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
శాలిగౌరారం : వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎల్పీఓ ప్రతాప్‌నాయక్ అన్నారు. మాదారం గ్రామంలో మొక్కలు నాటారు. సర్పంచ్ జెర్రిపోతుల మంజులాచంద్రమౌళి, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, ఎంపీఓ సుధాకర్ పాల్గొన్నారు. తక్కెళ్లపహాడ్లో సర్పంచ్ వేల్పుల స్వప్నానరేందర్ డ్రైనేజీ, మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించారు. పంచాయతీ కార్యదర్శి వాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని కొత్తపేట గ్రామంలో సర్పంచ్ బచ్చు జానకిరాములుతో కలిసి మండల ప్రత్యేకాధికారి కాంతమ్మ మొక్కలు నాటారు. పంచాయతీల లక్ష్యాల మేరకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ శేఖర్, మార్కెట్ డైరెక్టర్ సునీత, ఎంపీడీఓ భవాని, ఉపసర్పంచ్ తండు రాములుగౌడ్, ఈజీఎస్ ఏపీఓ కె.రామ్మోహన్, ఏపీఎం యాదమ్మ పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని ఇప్పర్తి గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద జమ్మి మొక్కను నాటారు. ఎంపీడీఓ యాకూబ్‌నాయక్, ఏపీఓ శ్రీనయ్య, సర్పంచ్ బొజ్జ సుజాత, శ్రీను, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఉప సర్పంచ్ సైదులు, పంచాయతీ కార్యదర్శి లింగస్వామి పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
నాంపల్లి : మండలంలోని శుంకిశాల సర్పంచ్ భాషిపాక రాములు ఇంటింటికీ తిరిగి మొక్కలను పంపిణీ చేశారు. మల్లపురాజులపల్లి గ్రామంలో సర్పంచ్ మునుగల సుధాకర్‌రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు.