పెన్పహాడ్, సెప్టెంబర్ 05 : సూర్యాపేట జిల్లా ఉత్తమ ఎంఈఓగా నకిరేకంటి రవి ఎంపికయ్యారు. ప్రస్తుతం పెన్పహాడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూ మండల పూర్థిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి వేడుకల్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, డీఈఓ అశోక్ కుమార్ చేతులమీదుగా అవార్డును నకిరేకంటి రవి అందుకున్నారు. అలాగే పెన్పహాడ్ మండలానికి చెందిన కంది బండ రాజేశ్వరి, జడ్పీహెచ్ఎస్ అనంతారం, సందా సైదిరెడ్డి ప్రాథమిక పాఠశాల పెద్ద సీతారాం తండా .వనమా లక్ష్మీ కే.జీ.బి.వి. పెన్పహాడ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు అందుకున్నారు
ఈ సందర్భంగా వారిని PRTU జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి, CHM కొండ మల్లారెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎరంశెట్టి రవీందర్ బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు ప్రమీల, PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అల్లాడి సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సంధ్యాల వినోద్ వివిధ సంఘాల భాధ్యులు ఉమర్ షేక్, జి.ఆనంద భాస్కర్, జాటోత్ దశరథ చందా సైదిబాబు, సీనియర్ నాయకులు వి.సుదర్శన్, ఆసియా జాబీన్, ఉపాధ్యాయులు వై.ఉపేందర్, ఎన్.లక్ష్మయ్య, ఉగ్గం నాగరాజు, ఎం.స్నేహ లత, కేజీబీవీ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.