రెండు అడుగులు పెరిగిన సాగర్ నీటి మట్టం
నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.
- ప్రస్తుతం 505 అడుగులు
నందికొండ, జూలై 21 : నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతుండండంతో జల విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని దిగువకు వదులుతుండడంతో సాగర్ నీటి మట్టం 505 అడుగులకు చేరి రెండు అడుగులకు పెరిగింది.
డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 122.52 టీఎంసీలు ఉన్నది. కుడికాల్వ ద్వారా 5,700 క్యూసెక్కలు, ఎడమ కాల్వ ద్వారా 3,374 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 9,874 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 40.32 టీఎంసీలు ఉన్నది. శ్రీశైలానికి 96,107 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. కృష్ణా ప్రాంతంలో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జుసాగర్ రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

