నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9104 క్యూసె క్కులు, ఎడమ కాల్వ ద్వారా 7937 క్యూసె క్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33373 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 52614 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 881.80 అడుగులు (197.4617టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 12838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. స్థిరంగా