చందంపేట, జూన్ 24 : చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన చిమట ముత్తయ్య యాదవ్ బీసీ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముత్తయ్యయాదవ్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్యను శాలువాతో సన్మానించారు.