వలిగొండ/బీబీనగర్, జూన్ 9 : మూసీ బ్రిడ్జిపై ఏర్పడ్డ గుంతలకు మరమ్మతులు చేయాలని ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. భువనగిరి – చిట్యాల ప్రధాన రహదారిపై వలిగొండ సమీపంలో మూసీ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి గ్రామ సమీపంలో మూసీ వంతెనను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జిపై ఏర్పడ్డ గుంతలకు వెంటనే మరమ్మతులు చేసి ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లను తీర్చాలన్నారు. భవిష్యత్‌లో వాహనాల రద్దీకి అనుగుణంగా నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతుల కోసం పంపించాలని అధికారులను ఆదేశించారు. రుద్రవెల్లిలో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
అంతకుముందు మండల కేంద్రంలోని వేంకటేశ్వర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అమర్ న్యూరో సెంటర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు గోలి పింగళ్‌రెడ్డి, శ్యామ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్, రామాంజనేయులు పాల్గొన్నారు.