నాంపల్లి: పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్న మండలంలోని సుంకిశాల సర్పంచ్ బాషిపాక రాములును, తుంగఫాడ్ గ్రామనికి చెందిన నేతళ్ల కొండల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తునట్లు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మ డపు నర్సింహారావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ విసృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
పార్టీ అభివృద్ధి కొసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి పొగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ డైరెక్టర్స్ కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, బెక్కం రమేశ్, ఎస్కె అబ్బస్, సర్ధార్ నాయ క్, రమావత్ శంకర్‌నాయక్, రవి నాయక్, టేకులపల్లి లింగయ్య యాదవ్ తదితరులున్నారు.