నల్లగొండ, జనవరి 17 : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఎస్టీ-5 , ఎస్సీ-17, బీసీ-38 కేటాయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారు ఈ విధంగా ఉంది.
నల్లగొండ కార్పొరేషన్- జనరల్ మహిళ
* నందికొండ- ఎస్సీ జనరల్
* మోత్కూర్- ఎస్సీ మహిళ
* దేవరకొండ- బీసీ మహిళ రిజర్వ్
* హుజూర్నగర్- బీసీ జనరల్
* ఆలేరు- బీసీ మహిళ
* చండూరు, నకిరేకల్, హాలియా, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, పోచంపల్లి – ఓపెన్ జనరల్
* మిర్యాలగూడ, చిట్యాల, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్, కోదాడ – జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.