రాజాపేట, అక్టోబర్ 10: పాల బిల్లు చెల్లించాలని పాడి రైతు ఫోన్ సంభాషణలో.. దురుసుగా మాట్లాడిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి పాడి రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మదర్ డెయిరీ డైరెక్టర్ సందిల భాసర్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజాపేట పాల సొసైటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తురపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన పాడి రైతు చైర్మన్‌కు ఫోన్ చేసి సార్.. దసరా పండుగకు పాల బిల్లులు కావాలని అడిగితే చైర్మన్ అసహనం వ్యక్తం చేస్తూ నైర్యాశంతో సమాధానం చెప్పడం సరికాదన్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న చైర్మన్ మదర్ డెయిరీ మునిగితే ఏందీ.. తేలితే నాకేందీ అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. డెయిరీ అభివృద్ధి కోసం పూర్వం పని చేసినవారి అడుగుజాడల్లో చైర్మన్ నడుచుకోవాలి తప్ప ఆయన ఒకరే సంస్థను కాపాడినట్లు మాట్లాడడం శోచనీయమన్నారు. గతంలో గుత్తా జితేందర్‌రెడ్డి రైతుల పక్షాన నిలబడి 13 సంవత్సరాలు చైర్మన్‌గా హుందాగా సేవలందించిన తీరు గుర్తుకు లేదా? అని చెప్పుకొచ్చారు.
ప్రతి ఒకరూ తన సొంత మారును చూపెట్టి సంస్థలో పేరు సంపాదించుకున్నారే తప్ప ఇలా ఎప్పుడూ దిగజారి మాట్లాడలేదన్నారు. పదవికి గౌరవం ఇవ్వని గుడిపాటి మధుసూదన్‌రెడ్డి చైర్మన్ పదవికి అనర్హుడన్నారు. వెంటనే చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, నాయకులు గుర్రం నరసింహులు, అంకది సుదర్శన్, అంకతి నరసయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.