తుంగతుర్తి, జూలై 11 : సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనరీ భవనంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ తుంగతుర్తి మండల అధ్యక్షుడిగా చింతకుంట్ల అంబేద్కర్, ప్రధాన కార్యదర్శిగా చిట్టిపాక మహేష్, కోశాధికారిగా కొండగడపుల్ల వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కుంభం రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులను కబడ్డీ క్రీడలో తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె.ఎస్.ఎన్ రాజ్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పటేల్ నరసింహారెడ్డి, రామసాని రమేష్, సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మోర్తాల నాగిరెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం శెట్టి వీరన్న, రిటైర్డ్ పీడీ, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు హనుమంతరావు, క్రీడాకారుడు, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు, తడకమళ్ల రవికుమార్, జలంధర్, పరమేష్, సాయి కిరణ్ పాల్గొన్నారు.