హాలియా, ఫిబ్రవరి 20 : సంత్ సేవాలాల్ జీవితం భావి తరాలకు ఆదర్శనీయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం నాయుడుపాలెం గ్రామంలో అఖిల భారత గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఉద్ధరణ కోసం సంత్ సేవాలాల్ చేసిన కృషి మరువలేదన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుమతీపురుషోత్తం, ఆంగోతు భగవాన్‌నాయక్, సర్పంచ్ కిరణ్‌నాయక్, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రావుల చినభిక్షం, బీఆర్ఎస్ నాయకులు అల్లి పెద్దిరాజు, వర్రా వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ఎద్దుల పందేల విజేతలకు బహుమతులు
మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని రాజవరం గ్రామంలో నిర్వహించిన రెండు రాష్ర్టాల స్థాయి ఎద్దుల పందేలను ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆరు జతల ఎద్దులు పాల్గొనగా ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన గానుగ రాజశేఖర్‌రెడ్డి ఎద్దుల జత మొదటి బహుమతి, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన గాదె శ్రీనివాస్‌రెడ్డి ఎద్దుల జత రెండో బహుమతి గెలుచుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ బహుమతులు అందించారు. అనంతరం బీఆర్ఎస్ కేవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్‌యాదవ్, మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు పోలేపల్లి అంజయ్య, నెమలి సునీతాకృష్ణారెడ్డి, సర్పంచ్ నడ్డి లింగయ్యయాదవ్, కేతావత్ రామకృష్ణనాయక్, స్వామినాయక్, నాయకులు వర్రా వెంకట్‌రెడ్డి, సుధాకర్, హరికృష్ణ, అల్లి పెద్దిరాజుయాదవ్, బీవీ రమణరాజు, బాలూనాయక్ పాల్గొన్నారు.