గుర్రంపోడ్, మే 3 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. మరోసారి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, లేకుంటే ఆరు హామీలు కాదు కదా.. తెలంగాణ ఆగమాగం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాలు పట్టిన పంట భూములు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీళ్లుగా మారాయని పేరొన్నారు. ప్రతి ఒకరూ మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆ ర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్, నాయకులు వేముల యాదయ్య, నల్ల శ్రీరాములు, మల్లోజు నాగార్జునాచారి, కునూరి సైదిరెడ్డి, మేకల వెంకన్న,రఘుపతిరెడ్డి, నల్ల నందు, మృగశిర యాదయ్య, మారపాక గిరి, వంగూరి మహేశ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వల్లపునేని అంజయ్య తండ్రి ముత్తయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి ముత్తయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.