భువనగిరి అర్బన్, నవంబర్ 18 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మోతె మనోహార్, కాంగ్రెస్‌కి చెందిన తుమ్మల వినోద్, 8వ వార్డు కార్యకర్తలు 80 మంది శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడకు ముందు.. ఏర్పడిన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. హైదాబాద్‌కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతం అత్యంత వేగంద్గ అభివృద్ధికి నోచుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ హాబ్ను మంజూరు చేశారని తెలిపారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పంగరెక్క స్వామి, ఇట్టబోయిన గోపాల్, ఎడ్ల వెంకట్‌రెడ్డి, సమ్మి, బబ్లూ, కుతడి సురేశ్, షేక్ మజార్పాష, మహేందర్‌రెడ్డి, శివ, లోకేశ్, భవానీప్రసాద్, పాల్గొన్నారు.