కోదాడ, జూన్ 17 : కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి జన్మదిన వేడుకలు మంగళవారం కోదాడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఏందే వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అలాగే మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులు కారింగుల అంజిగౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవఖానాలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రమీల, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు చిన్నపరెడ్డి మధుసూదన్, బ్రహ్మయ్య, అనంతరాములు, ప్రసాద్ సాయి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.