సూర్యాపేట అర్బన్, జూన్ 16 : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిపో సీనియర్ అసిస్టెంట్ సంకరి శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీనివాస్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సమావేశానికి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రీనివాస్ చేసిన సేవలకు గాను ఇంటి పేరునే డీఎంగా సార్ధకం చేసుకున్న వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో స్నేహపూర్వకంగా ఉండి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ 34 సంవత్సరాలుగా శ్రీనివాస్ ఆర్టీసీలో ఆనేక హోదాల్లో పని చేశారని, ఆయన చేసిన కృషి మూలంగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న శ్రీనివాస్, సునీత దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం శివశంకర్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వద్దామరెడ్డి, పుల్లయ్య, వెంకట్‌రెడ్డి, నరేందర్, నర్సయ్య, ఏకాంబరం, అయోధ్య, ఏఎస్ గౌడ్, లచ్చయ్య, బీఆర్ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, పూర్ణశశికాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.