సూర్యాపేట నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరగా.. తొలి సమావేశంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జగదీశ్‌రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.