ఆలేరు రూరల్, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొలనుపాక, రాఘవాపురం, రాజానగరం, బైరాంనగరం, శ్రీనివాసపురం, పటేల్‌గూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహలను ఆరికట్టేలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారన్నారు. కులవృత్తుల పెట్టుబడులకు రూ.లక్ష సాయం అందజేశారన్నారు. స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి ఇప్పించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ చేరుకుందన్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. గతంలో కాంగ్రెస్ హాయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ఆ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులను బిచ్చగాళ్లతో పోల్చిన రేవంత్‌రెడ్డికి ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హరిశంకర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 50వేల మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేశ్‌గౌడ్, సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రాంప్రసాద్, వడ్ల నవ్యాశోభన్‌బాబు, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మామిడాల అనీతాఅంజయ్య, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కాసగల్ల అనసూయ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు జంగ స్వామి, వెంటిక మధు, కరికె మల్లేశ్, గంపల విజయ్‌కుమార్, నంద మహేందర్, నాయకులు అరె పాండు, పరిదె సంతోష్, కొటగిరి ఆంజనేయులు, మైదం రంగయ్య, బండ జహంగీర్, బండ రమేశ్, శ్రీకాంత్‌నాయక్, సర్వర్‌పాషా, సొంటెం ప్రవీణ్, బాశెట్టిరాజు, మిట్టపల్లి పాండు పాల్గొన్నారు.