కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకట్లు తప్పవని, బీఆర్ఎస్ను గెలిపిస్తే నిరంతరం వెలుగులు ఉంటాయని ఆ పార్టీ ఆలేరు అభ్యర్థి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆత్మకూరు(ఎం) మండలానికి సాగు నీరు అందించడానికి చేపట్టిన బునాదిగాని కాల్వ పనులను సొంత నిధులతో పూర్తి చేయించామన్నారు.
మరోసారి గెలిపిస్తే కాళేశ్వరం జలాలు అందిస్తానని తెలిపారు. ఇప్పటికే ఇస్తున్న పథకాలతోపాటు సౌభాగ్యలక్ష్మి, తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత ప్రమాద బీమా, రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ వంటివి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయని చెప్పారు.
– ఆత్మకూరు(ఎం), నవంబర్ 26
ఆత్మకూరు(ఎం), నవంబర్ 26 : కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకట్లు తప్పవని.. బీఆర్ఎస్ను గెలిపిస్తే నిరంతరం వెలుగులు ఉంటాయని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రహీంఖాన్‌పేట, కప్రాయపల్లి, మోదుగుబావిగూడెం, టీ రేపాక, ఉప్పలపహాడ్, పారుపల్లి, పల్లెపహాడ్, కొరటికల్, ఇప్పల్ల, రేగులకుంటలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ నాయకులు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బీజేపీ మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండలానికి సాగునీరును అందించడానికి బునాదిగాని కాల్వ పనులను సొంత నిధులతో పూర్తి చేయించామని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కాల్వ ద్వారా కాళేశ్వరం జలాలు అందిస్తామని చెప్పారు. మండలంలోని పారుపల్లి, టీ రేపాక, కామునిగూడెం, కప్రాయపల్లిలో బిక్కేరువాగుపై కోట్లాది రూపాయలతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీంతో భూగర్భజలాలు పెరిగి రైతాంగానికి మేలు జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని సౌభాగ్యలక్ష్మి, తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాదబీమా, రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం మండలంలోని ఉప్పలపహాడ్‌లో కాంగ్రెస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు గుమిడెల్లి యాదగిరి, సీనియర్ నాయకులు కడకంచి శ్రీశైలం, మహేందర్‌రెడ్డితో పాటు 10మంది బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, సర్పంచులు లగ్గాని రమేశ్‌గౌడ్, ఆకుల సరిత, దుంప వెంకటమ్మ, మాధవి, సత్తయ్యగౌడ్, మాధవి, ఎంపీటీసీ వెంకన్న, మాజీ ఎంపీపీ భాగ్యశ్రీ, జిల్లా నాయకుడు గడ్డమీది రమేశ్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ దయాకర్‌రెడ్డి, అంజిరెడ్డి, రాములు, యాదగిరి, మహేందర్‌రెడ్డి, భానుప్రకాశ్, మల్లేశ్, పర్వతాలు, నాగరాజు పాల్గొన్నారు.