నల్లగొండ : గ్రామాలు ఆర్థికంగా మెరుగుపడి, అభివృద్ధిని సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఆయన గ్రామస్థులతో చర్చించారు. దేశంలో ఏ నాయకుడు చెయ్యని విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
ఇంటికి పెద్దకొడుకులా సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.