నార్కట్‌పల్లి నవంబర్ 19 : ఎవ్వరెన్ని కుట్రలు పన్నినా నకిరేకల్‌లో ఎగిరేది గులాబీ జెండానని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ 10, 11 వ వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమ దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మోసపోతామన్నారు.
నార్కట్‌పల్లి పట్టణం త్వరలో మోడల్ సిటీగా తయారవుతుందని రూ. 16 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు పూర్తి అవుతున్నాయని అన్నారు. మండలంలో ఇప్పటివరకు రోడ్లు పూర్తి చేశామన్నారు. సీసీ రోడ్లు డ్రైనేజీ అన్ని గ్రామాల్లో పూర్తయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తవుతుందని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణు, కన్నెబోయిన సైదులు, దుబ్బాక శ్రీధర్, పసునూరి శ్రీనివాస్, మేడబోయిన శ్రీనివాస్, పుల్లెంల మహేశ్, చాంద్‌పాషా, బొబ్బలి మల్లేశ్, యాదగిరి, శ్రావణ్, కార్తీక్, దుబ్బ రవి పాల్గొన్నారు.