దేవరకొండరూరల్, జనవరి11: పట్టణ పరిధిలోని పెంచికల్ పహాడ్లో చేపడుతున్న అవుట్ డోర్ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులను ఆదేశించారు. స్టేడియం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియం పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు.
స్టేడియం పూర్తయితే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జాన్యాదవ్, పంచాయతీరాజ్ డీఈ లింగారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ పాల్గొన్నారు.