దేవరకొండ రూరల్, జూన్ 14 : దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ వీవీ రామారావు శనివారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.